Sunday 22 December 2019

Mudhugare Yashoda Song Lyrics in Telugu

ముద్దు గారే యశోద


పల్లవి  ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు చరణం1: అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చరణం2: రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు చరణం3: కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము బాలునీవలె దిరిగే పద్మనాభుడు




No comments:

Post a Comment