Tuesday 20 September 2022

Quotes From Rama Charita Manas in Telugu - 3

 


జా అస హిసిషా కరహి నర , జడ బిబేక అభిమాన | 
పరహి కలప భరి నరక మాహు , జీవ కి ఈస సమాన | 

కానీ మూర్ఖుడు ఎవడైనను జ్ఞానగర్వమున గొప్పవారితో పోటీపడి అనుకరించినచో 
వాడు ఒక కల్పము వరకు నరకమును అనుభవించును . జీవుడు ఎన్నడైనను పరమాత్మతో సమానుడగునా ?

సురసరి జల కృత బారుని జానా | కబహు న సంత కరహి తెహి పానా | 
సురసరి మిలే సొ పావన జైసే | ఈస అనీసహి అంతరు తైసే | 

మద్యము గంగాజలముతో సిద్దమైనదని తెలిసినను సజ్జనులు ఎవ్వరును దానిని ముట్టరు. 
అదే మద్యం గంగానది లో కలిసినప్పుడు పవిత్రమగును. అట్లే జీవేశ్వరుల మధ్య గల అంతరము గూడ ఇట్టిదే అని గ్రహింప వలెను   

No comments:

Post a Comment