Quote No. 15 in
Sri Rama Charitha Manas
Telugu Translation
Quote
సగునహి అగునహి నహిఁ కఛు భేదా।
గావహిఁ ముని పురాన బుధ బేదా ॥
అగున అరూప అలఖ అజ జోఈ|
భగత ప్రేమ బస సగున సొ హోఈ ॥ 1 ॥
జో గున రహిత సగున సొఇ కైసేఁ |
జలు హిమ ఉపల బిలగ నహిఁ జైసే( ॥
జాసు నామ భ్రమ తిమిర పతంగా।
తెహి కిమి కహిఅ బిమోహ ప్రసంగా ॥ 2 ॥
రామ సచ్చిదానంద దినేసా |
నహిఁ తహఁ మోహ నిసా లవలేసా ॥
సహజ ప్రకాసరూప భగవానా।
నహిఁ తహఁ పుని బిగ్యాన బిహానా ॥ ౩ ॥
హరష బిషాద గ్యాన అగ్యానా।
జీవ ధర్మ అహమితి అభిమానా ॥
రామ బ్రహ్మ బ్యాపక జగ జానా |
పరమానంద పరేస పురానా ॥ 4 ||
Meaning
సగుణనిర్గుణబ్రహ్మలకుమధ్య ఎట్టిభేదమూ లేదని వేదశాస్త్ర పురాణములు ప్రతిపాదించుచున్నవి. పండితులు, మహర్షులు దీనిని ఎలుగెత్తి చాటుచున్నారు. నిర్గుణుడు. నిరాకారుడు, అజుడు, అగోచరుడు ఐన పరమాత్మయే భక్తులప్రేమలకువశుడై సగుణుడు అగుచున్నాడు. నిర్గుణుడు సగుణుడెట్లగు చున్నాడు? నీరు మంచుగా మాఱును. వాస్తవముగా ఆ రెండింటికి మధ్య ఎట్టి భేదమూ లేదు. అట్లే భగవంతుని సగుణ నిర్గుణ స్వరూపములలో భేదము ఏ మాత్రమూ లేదు. శ్రీరామనామోచ్చారణయే భ్రమయనెడి చిమ్మ చీకట్లను సూర్యకిరణములవలె పాఱద్రోలును. అట్టిమహిమాన్వితుడైన శ్రీరాముడు మోహవశుడైనాడనిపల్కుట చెల్లదు. శ్రీరాముడు సచ్చిదానందస్వరూపుడైన భాస్కరుడు. అచట అజ్ఞానమనెడి రాత్రి లేశమాత్రముగూడ నిలువజాలదు. షడైశ్వర్యయుక్తుడగుసరమాత్మ సహజముగనే శాశ్వత ప్రకాశరూపుడు. అచ్చట విజ్ఞానమనెడి ప్రాతఃకాలముగూడ ఉండదు. (రాత్రియే లేనప్పుడు ఇక ప్రభాతప్రస్తావనకు తావే ఉండదు గదా!) హర్షశోకములు, జ్ఞాన-అజ్ఞానములు, అహంకార-అభిమానములు బద్దజీవుల లక్షణములు. శ్రీరామచంద్రుడు సర్వవ్యాపియైన పరబ్రహ్మ, పరమానందస్వరూపుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు, పురాణ పురుషుడు. ఇది లోక ప్రసిద్ధము.
No comments:
Post a Comment