Thursday, 5 March 2026

Quote No. 16 in

Sri Rama Charitha Manas
Telugu Translation



అగున సగున దుఇ బ్రహ్మ సరూపా।

అకథ అగాధ అనాది అనూపా ॥

మోరేఁ మత బడ నాము దుహూ తేఁ |

కిఎ జెహిఁ జుగ నిజ బస నిజ బూతేఁ ॥ 1 ॥


ప్రౌఢి సుజన జని జానహిఁ జన కీ |

కహఉఁ ప్రతీతి ప్రీతి రుచి మన కీ ॥

ఏకు దారుగత దేఖిఅ ఏకూ । 

పావక సమ జుగ బ్రహ్మ బిబేకూ ॥2॥


ఉభయ అగమ జుగ సుగమ నామ తే |

కహెఉఁ నాము బడ బ్రహ్మ రామ తే ॥

బ్యాపకు ఏకు బ్రహ్మ అబినాసీ | 

సత చేతన ఘన ఆనంద రాసీ ॥ 3 ॥


అస ప్రభు హృదయఁ అఛత అబికారీ |

సకల జీవ జగ దీన దుఖారీ ॥

నామ ని

రూపన నామ జతన తే।

సొఉ ప్రగటత జిమి మోల రతన తేఁ || 4 || 


Meaning

పరబ్రహ్మ నిర్గుణ - సగుణరూపుడు. ఈ రెండు రూపములును అనిర్వచనీయములు, అగాధములు, అనాది-నిరుపమానములు. నామము ఈ రెండింటి కంటెను గొప్పది. ఏలనన ఈ రెండు రూపములును నామము యొక్క శక్తికి వశమైయుండును. సజ్జనులు దీనిని నా ప్రౌఢక్తిగా భావింపరాదు. నేను నా మనస్ఫూర్తిగా శ్రద్ధాదరములతో చెప్పుచున్నాను. పై రెండు రూపములుగల బ్రహ్మజ్ఞానము అగ్నితో సమానము. నిర్గుణబ్రహ్మ కఱ్ఱలోగల అవ్యక్తాగ్ని. మనకు కనబడు వ్యక్తాగ్ని సగుణ బ్రహ్మ. తాత్త్యికముగా ఈ రెండింటిని తెలిసి కొనుట కష్టము, కాని నామజపమువలన రెండును సుగమములగును. నామము నిర్గుణబ్రహ్మ కంటెను, సగుణరామునికంటెను మహిమోపేతమైనది. బ్రహ్మము ఒక్కడే, అతడు సర్వవ్యాపి, శాశ్వతుడు, సచ్చిదానంద ఘన స్వరూపుడు. ఇట్టి నిర్వికారబ్రహ్మ తమ హృదయముల యందే యున్నను జీవులు దీనులును, దుఃఖితులును అగుట జరుగు చుండును. నామమహిమను తెలిసికొని, జపించుటచే రత్నమును గుర్తించినంతనే దాని విలువ తెలిసినట్లు బ్రహ్మము ప్రకటితుడగును.


No comments:

Post a Comment